ఎస్టీ జాబ్ రిజర్వేషన్ తీసివేస్తే సహించేది లేదు.
“తాండూరులో లంబాడీల గోరు బంజారుల మహాభోజ్ ఘనంగా”
సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సెలువుగా ప్రకటించాలి.
సేవాలాల్ గురించి పాఠ్యపుస్తకాలలో చేర్పించాలి.
అగ్నిజాల ప్రతినిధి తాండూర్
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం
వినాయక కన్వెన్షన్ హాల్లో గోరు బంజారుల మహభోగ్ కార్యక్రమాన్నీ లంబాడీలు ఘనంగా జరుపుకున్నారు. లంబాడీల ఆరాధ్య దైవం సేవాలాల్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో నుంచి లంబాడీలను తొలగిస్తే సహించేది లేదు. సేవాలాల్ జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించాలి. అదేవిధంగా పాఠ్యపుస్తకాలలో సేవాలాల్ చరిత్రను చేర్చాలని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ పిలుపునిచ్చారు.

