రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీసీలకు ఇవ్వాలి: రాజ్‌కుమార్
బీసీ సీఎం ప్రకటనను స్వాగతించిన కందుకూరి రాజ్‌కుమార్
తెలంగాణకు బీసీ సీఎం కావాలి.. మహేష్‌కుమార్ గౌడ్ ప్రకటనపై హర్షం
తాండూర్: manasa news: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి బీసీ వ్యక్తి అవుతారని శంషాబాద్ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ చేసిన ప్రకటనను తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘాల నాయకులు స్వాగతించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ కార్యవర్గ సభ్యుడు కందుకూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించి మహేష్‌కుమార్ గౌడ్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు.మహేష్‌కుమార్ గౌడ్ తన ప్రకటనకు కట్టుబడి, కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని సైతం ఒప్పించి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ఏర్పాటుకు కృషి చేయాలని రాజ్‌కుమార్ కోరారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని వర్గాల నాయకులు బీసీ సీఎం అంశానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీలు కూడా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అంశంపై తమ వైఖరిని వెంటనే బహిరంగంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాతినిధ్యం కల్పించే విషయంలో అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణలోని రెండు స్థానాల్లో కనీసం ఒక స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని కోరారు. అలాగే స్థానిక సంస్థలు, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన తగిన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం కల్పించాలని మహేష్‌కుమార్ గౌడ్‌ను కోరారు.బీసీలు రాజకీయంగా ఎదగాలంటే కేవలం హామీలు కాకుండా, ఆచరణలో పదవులు మరియు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని రాజ్‌కుమార్ పేర్కొన్నారు. బీసీల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు వడ్డే సత్యనారాయణ, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళా సంఘం ప్రతినిధులు మంజుల, నరసమ్మ, విజయలక్ష్మి, అనిత, మండలాల అధ్యక్షులు నరేందర్, లక్ష్మణ్ చారి, శ్రవణ్ కుమార్, నాయి బ్రాహ్మణ సమాజం నాయకులు పరమేష్, బీసీ సంఘం నాయకులు రాము ముదిరాజ్, మంతటి రాజు, బసవరాజ్, జోసెఫ్, భరత్ గౌడ్, కిరణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

