ఎమ్మెల్సీ ఎన్నికలపై కిలకభేటీ

 

ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ

ఎమ్మెల్సీ ఎన్నికలపై జాదవ్ ధారాసింగ్‌తో సామ రామ్మోహన్ రెడ్డి చర్చలు

జాదవ్ ధారాసింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన MLC అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి

వికారాబాద్: manasa news: ఉమ్మడి మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం, ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారు. పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించడం, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు