గ్రామమంతా ఒక్కటై బతుకమ్మ

 

సంప్రదాయాలకు పెద్దపీట.. హన్మాపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు!

హన్మాపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు..

పెద్దేముల్   మానస   న్యూస్  ప్రతినిధి :    పెద్దేముల్    మండలం   హన్మాపూర్ గ్రామంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామ ప్రజలందరూ కలిసి ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుపుకున్నారు. మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చారు.గ్రామ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ, ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడంలో గ్రామ ప్రజాప్రతినిధులు చూపిన చొరవ అభినందనీయం. గ్రామ ప్రజలతో కలిసి పండుగలో పాల్గొనడం ద్వారా ప్రజాప్రతినిధులు గ్రామ ఐక్యతకు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు.ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ లొంక రాములు, ఉప సర్పంచ్ పెంజుగుల మాలేశం, వార్డు సభ్యులు పెంజుగుల నీలమ్మ, పెంజుగుల రమేష్, పెంజుగుల అనిత, టీ. దస్తప్ప, పెంజుగుల శేఖర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.బతుకమ్మ వంటి పండుగలు మహిళల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఇలాంటి వేడుకలను గ్రామ ప్రజలందరూ కలిసి జరుపుకోవడం సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తుంది. హన్మాపూర్ గ్రామంలో సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించడం అభినందనీయం.

 

 

 

 

 

 

 

.