కాలిన ఇంటికి సాయం!

కష్టాల్లో ఉన్న కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్ అండ!

ఇల్లు దగ్ధం.. బాధిత కుటుంబానికి ఫౌండేషన్ భరోసా!

కరెంట్ కాల్చింది.. విజయక్క ఆదుకుంది

యాలాల్ మానస న్యూస్ ప్రతినిధి:యాలల మండలం, రస్నం గ్రామం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో కుమ్మరి బుచ్చమ్మకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులతో పాటు కష్టపడి దాచుకున్న నగదు కూడా కాలిపోయింది. సుమారు రూ.50 వేల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితురాలు తెలిపింది. ఒక్కసారిగా ఇల్లు కాలిపోవడంతో బుచ్చమ్మ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది.విషయం తెలుసుకున్న కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ అధినేత విజయలక్ష్మి వెంటనే స్పందించారు. ఫౌండేషన్ సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, నిత్యావసర వస్తువులను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి, మానవత్వమే మిన్న అని చాటిన కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ సేవలను పలువురు అభినందించారు