ఉద్యమకారుల విజ్ఞప్తికి సీఎం స్పందన!

ఉద్యమకారులకు గుర్తింపు దిశగా మరో ముందడుగు!

సీఎం రేవంత్ రెడ్డికి తాండూరు ఉద్యమకారుల పాలాభిషేకం

ఉద్యమకారుల సంక్షేమానికి సీఎం కీలక ఆదేశాలు!

తాండూరు:మానస న్యూస్ ప్రతినిధి :తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు గుర్తింపు కల్పించడంతో పాటు, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఉద్యమకారుల కమిటీ అధ్యక్షులు కేశవరావు చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం పట్ల తాండూరు నియోజకవర్గ ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు.ఉద్యమకారుల వివరాలు, ఉద్యమ సమయంలో నమోదైన కేసులు, ఇతర సంబంధిత సమాచారాన్ని నమోదు చేసేందుకు వెంటనే కొత్త వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రణాళికా సంఘం కార్యదర్శిని ఆదేశించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.ఉద్యమకారుల వివరాలు, ఉద్యమ సమయంలో నమోదైన కేసులు, ఇతర సంబంధిత సమాచారాన్ని నమోదు చేసేందుకు వెంటనే కొత్త వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రణాళికా సంఘం కార్యదర్శిని ఆదేశించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారి వివరాల సేకరణకు ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలని ఆదేశించడం అభినందనీయమని పేర్కొన్నారు.ప్రభుత్వం వీలైనంత త్వరగా ఉద్యమకారుల వివరాల నమోదు ప్రక్రియను పూర్తి చేసి, వారికి అర్హతకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారులకు తగిన గుర్తింపు, గౌరవం, ప్రభుత్వ సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గ ఉద్యమకారులు ఒంగోని బాయ్ శ్రీనివాస్, జిలాని, సంజయ్ గౌడ్, అశోక్, ప్రకాష్ గౌడ్, ఆకుల శివకుమార్, మొయిజ్ బేగ్, శివ, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.