సాయిపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సాయిపూర్‌లో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దంపతులు

  • తాండూరు:మానస న్యూస్ ప్రతినసంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగాయి. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు పండుగ శోభను సంతరించుకున్నాయి.ఈ  వేడుకలకు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తన సతీమణి ఆర్తి రెడ్డి, మాతృమూర్తి, మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని విఠల్ రెడ్డితో కలిసి హాజరై సందడి చేశారు. మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని పండుగ సంబరాలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు. గురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చిన మహిళలు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.