సమాజ ఐక్యత కోసం కృషి చేస్తా:

 

తెలంగాణ ఇంచార్జ్‌గా చంద్రశేఖర్ గౌడ్

కల్వార్ కలాల్ సమాజం కోసం కొత్త బాధ్యత.. చంద్రశేఖర్ గౌడ్‌కు కీలక పదవి

తాండూరు : manasa news ప్రతినిధి :అఖిల భారతీయ కల్వార్ కలాల్ మహాసభ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్‌గా తనను నియమించినందుకు కలాల్ చంద్రశేఖర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు, జాతీయ కార్యదర్శి, మహాసభ పెద్దలు, నాయకులు, తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వర్తిస్తానని కలాల్ చంద్రశేఖర్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణలో కల్వార్ కలాల్ సమాజాన్ని మరింత ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.సమాజం ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని, మహాసభ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు సమాజ పెద్దలు, నాయకులు, యువత సహకారం, ఆశీస్సులు అందించాలని కోరారు.