మైల్వార్లో విషాదం కుటుంబానికి పంజుగుల బ్రదర్స్ పరామర్శ
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ నాయకులు
బషీరాబాద్ మండలం,manasa news ప్రతినిధి:మైల్వార్: మైల్వార్ మాజీ సర్పంచ్ శేఖర్ కుమారుడు నాలుగు రోజుల క్రితం క్యాన్సర్ వ్యాధితో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పంజుగుల విట్టల్ రెడ్డి, తాండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డిలు మైల్వార్లోని శేఖర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, చిన్న వయసులోనే కుటుంబ సభ్యుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని అన్నారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని, అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు.అనంతరం మృతుడి కుటుంబ సభ్యులతో కొంతసేపు మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు.ఈ పరామర్శ కార్యక్రమంలో బషీరాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పంజుగుల నర్సిరెడ్డి (రాజన్న)తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మైల్వార్లో జరిగిన ఈ విషాద ఘటన పట్ల స్థానికులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు.

