ప్రాణాలను కాపాడే జ్ఞానం..

 

విద్యతో పాటు ప్రాణరక్షణ నైపుణ్యాలు.. విజయలక్ష్మి ఫౌండేషన్‌ సేవాభినందనం

ప్రాణాలు కాపాడే పాఠం.. విజయలక్ష్మి ఫౌండేషన్‌ వినూత్న సేవ

ప్రాణదాతగా విజయలక్ష్మి.. విద్యార్థులకు CPRపై విలువైన శిక్షణ

తాండూర్: manasa news ప్రతినిధి :ప్రభుత్వ కళాశాలలో కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు CPRపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గుండె ఆగిపోయినప్పుడు లేదా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడినప్పుడు తక్షణమే CPR అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని విద్యార్థులకు వివరించారు.ప్రత్యేక నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ సమక్షంలో విద్యార్థులకు CPR ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అత్యవసర సమయంలో ఎలా స్పందించాలి అనే అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రాక్టికల్‌గా శిక్షణ అందించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని CPR చేసే విధానాన్ని ప్రత్యక్షంగా నేర్చుకున్నారు.ఈ సందర్భంగా కంజర్ల విజయలక్ష్మి మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సాయం అందేలోపు సరైన ప్రథమ చికిత్స అందించడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ CPRపై కనీస అవగాహన కలిగి ఉంటే ఆపద సమయంలో విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.విద్యార్థులకు విద్యతో పాటు ప్రాణరక్షణ నైపుణ్యాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు