ఒగ్గు కథకు ఘన సత్కారం

 

ఒగ్గు కథకు అంకితమైన కళా యోధుడు.. నరసింహంకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం!

కళా సేవకు జాతీయ ముద్ర.. కే.కే. నరసింహంకు అరుదైన గౌరవం!

జానపద కళకు జీవం పోస్తూ.. జాతీయ స్థాయిలో నరసింహం సత్తా!

,తాండూర్ : manasa news ప్రతినిధి :తెలంగాణ జానపద కళ అయిన ఒగ్గు కథకు విశేష సేవలందిస్తూ కళను కాపాడుతూ, భావితరాలకు అందిస్తున్న ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు, ఒగ్గు కథ జానపద కళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.కే. నరసింహం మాదాసి కురువకు మరో అరుదైన గౌరవం దక్కింది.హైదరాబాద్ యూనివర్సిటీలోని సావిత్రిబాయి పూలే ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ 2025 వర్దల్ ఒగ్గు కథ అవార్డులకు తెలంగాణ నుంచి ఎంపికైన 25 మంది కళాకారుల్లో కే.కే. నరసింహం ఒకరిగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా బలగం సినిమా నిర్మాత సుధాకర్ రెడ్డి, సినీ హీరో విజయ్ తదితరుల చేతుల మీదుగా శాలువాతో సన్మానం, ప్రశంసాపత్రం, అవార్డును స్వీకరించారు.ఈ సందర్భంగా కే.కే. నరసింహం మాట్లాడుతూ ఒగ్గు కథ వంటి తెలంగాణ జానపద కళకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన కళా ప్రస్థానంలో సహకరించిన కుమారస్వామి, రాజ్‌కుమార్ తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.కే.కే. నరసింహం ఇప్పటివరకు వివిధ సంస్థల నుంచి 101 అవార్డులు అందుకున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ స్థాయి నుంచి మూడు అవార్డులు, 75వ ఉత్సవాల రాష్ట్ర టాలెంట్ అవార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు, రాష్ట్ర ఉత్తమ ఒగ్గు కళాకారుడి అవార్డు, శతాబ్ది ఉత్సవాల అవార్డులతో పాటు 10 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఉండటం విశేషం.