హంగామా కాదు.. అభివృద్ధి కావాలి!

 

అసభ్య నినాదాలు ప్రజాస్వామ్యానికి మచ్చ: కె. గోపాల్

అభివృద్ధిపై చర్చకు సిద్ధం: గోపాల్

తాండూరు. manasa news ప్రతినిధి :బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో కొందరు చేసిన అసభ్య నినాదాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, న్యాయవాది కె. గోపాల్ విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు విధానాలు, అభివృద్ధి అంశాలకే పరిమితం కావాలని, వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు .ఇంత పెద్ద ర్యాలీలో అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వాటిని ఖండించకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా యువజన నాయకుడు అనిల్ బాండ్ చేసిన వ్యాఖ్యలపై రోహిత్ రెడ్డి స్పష్టమైన వైఖరి వెల్లడించాలని, తాండూరు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.అభివృద్ధిపై చర్చకు సిద్ధంబీ  ఆర్ఎస్ పాలనలో తాండూరుకు వచ్చిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పనులు ఎంతమేరకు ఉన్నాయో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన నిధులు, జరుగుతున్న అభివృద్ధి పనులు ఎంతమేరకు ఉన్నాయో ప్రజల సమక్షంలో ఆధారాలతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని k.గోపాల్ తెలిపారు.తాండూరు ప్రజలకు హంగామా, బలప్రదర్శన రాజకీయాలు అవసరం లేదని, అభివృద్ధి, ఉపాధి, విద్య, తాగునీరు, రోడ్లు, సంక్షేమం వంటి అంశాలపై పనిచేసే నాయకత్వమే కావాలని అన్నారు.ఎవరు హంగామా రాజకీయాలు చేస్తున్నారో, ఎవరు అభివృద్ధిని ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్నారో ప్రజలకు స్పష్టంగా తెలుసని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారనిk.గోపాల్ పేర్కొన్నారు. తగిన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తమ తీర్పును ఇస్తారని ఆయన అన్నారు.