సేవలో సరికొత్త బాట.. సీమంత కానుకలతో విజయక్క ఆప్యాయత
మహిళల ముంగిట్లో మమకారపు మురిపెం.. విజయక్క సేవలకు ప్రశంసల వెల్లువ
సీమంత కానుకలతో గిరిజన తండాల్లో ఆత్మీయత చాటిన విజయక్క
పెద్దేముల్: manasa news ప్రతినిధి :మండలంలోని బండమీదిపల్లి గ్రామంలో కాంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు ఘనంగా సీమంత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకురాలు కాంజర్ల విజయలక్ష్మి గర్భిణీ మహిళలను ఆత్మీయంగా పలకరించి, చీర, సారెతో సత్కరించి సీమంత కానుకలను అందజేశారు.గర్భిణీ మహిళల జీవితంలో సీమంతం ఒక ప్రత్యేకమైన వేడుక అని, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా, తల్లీబిడ్డలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గిరిజన తాండాల్లోని మహిళలతో ఆత్మీయ అనుబంధాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గర్భిణీ మహిళలు, కుటుంబ సభ్యులు విజయలక్ష్మి ఫౌండేషన్ చేస్తున్న సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. మహిళల సంక్షేమం, ఆత్మీయత, సామాజిక సేవకు ఫౌండేషన్ ముందుండటం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

