కాంగ్రెస్ లో మక్సుత్ కు కీలక పదవి

కాంగ్రెస్‌లో మక్సూద్‌కు కీలక బాధ్యతలు.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం

తాండూరు కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మక్సూద్ నియామకం

తాండూరు, manasa tv news: ప్రతినిధి :కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మక్సూద్ నియమితులయ్యారు. ఈ మేరకు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు.కాంగ్రెస్ పార్టీ పట్ల మక్సూద్‌ చూపిన నిబద్ధత, అంకితభావం, ప్రజా సంక్షేమం కోసం చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు నియామక పత్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషిని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. మక్సూద్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీని పట్టణంలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యలను పార్టీ దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మక్సూద్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మక్సూద్ నియామకంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.