అలరాయప్ప జాతర ఉత్సవాలు

దుద్యాల మండలం :అలరాయప్ప జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతీ ఏడాది శ్రావణమాసంలో వచ్చే అలరాయప్ప జాతర ఉత్సవాలకు కోసిగి, నారాయణ పేట్, మహబూబ్ నగర్, వికారాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర, తదితర చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చి ఈ జాతర ఉత్సవాలలో పాల్గొన్నారు. భక్తులు తరలివచ్చి తమ తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతర ఉత్సవాలలో సర్పంచ్ రాంపురపు లాలప్ప,మాజీ సర్పంచ్ రఘుపతి,పూజారులు, గ్రామ పెద్దలు,వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.