గిరిజన కుటుంబాల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో మహాభోగ్
తాండూరు వినాయక కన్వెన్షన్ హాల్‌లో మహా భోగ్ పూజ
సేవలాల్ మహారాజ్, భవాని మాత ఆశీస్సులు పొందిన భక్తజనులు
గోర్ సిక్వాడి, గోర్ సేన నాయకులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ ప్రత్యేక హాజరు
అగ్నిజాల ప్రతినిధి తాండూర్
శ్రావణ మాసం సందర్భంగా 30 రోజుల పాటు గిరిజనుల ఆరాధ్య దైవాలు సేవలాల్ మహారాజ్ మరియు భవాని మాతకు ప్రత్యేకంగా భోగ్ పూజలు నిర్వహించారు. ఈ రోజు తాండూరు నియోజకవర్గంలోని గిరిజన కుటుంబాల ఆధ్వర్యంలో మహా భోగ్ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమం తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ లో నిర్వహించబడింది. ఈ సందర్భంలో తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్, గోర్ శిక్వాడి తెలంగాణ కట్మలో వికారాబాద్ జిల్లా కోఆర్డినేటర్ రాథోడ్ దీపక్ నాయక్, కార్భరి పరశురామ్, గోర్ సేన డివిజన్ కోఆర్డినేటర్ రాందాస్ నాయక్, గోర్ శిక్వాడి శోభతి రాథోడ్ అనిల్, గోపాల్, చందర్, గోపాల్ టీచర్, సంతోష్, హీరసింగ్, చందర్, శంకర్, శ్రీను, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

