అర్హులకే ఇళ్లు – కాంగ్రెస్ క్లారిటీ

 

200 ఇళ్లు ఒకే వర్గానికి అన్నది అబద్ధం – కాంగ్రెస్ కౌంటర్

అర్హులకే ఇళ్లు – అవకతవకలకు తావులేదు: కాంగ్రెస్

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై అబద్ధాల ప్రచారం – కాంగ్రెస్ ఖండన

అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తిగా పారదర్శకంగా పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగిదని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, న్యాయవాది కె. గోపాల్ తెలిపారు.తాండూరులో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పట్టణంలో సుమారు వెయ్యి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అర్హులైన పేద కుటుంబాలకు కేటాయించే ప్రక్రియ పూర్తిగా నిష్పాక్షికంగా జరుగుతోందన్నారు.తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో గతంలో అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరించబడినట్లు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి అర్హుల జాబితాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆ జాబితా ఆధారంగా కలెక్టర్ సమక్షంలో లాటరీ విధానంలో ఇళ్ల కేటాయింపు జరుగుతోందన్నారు.ఈ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు, అక్రమాలకు తావు లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు 200 ఇళ్లను ఒకే వర్గానికి కేటాయించారని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు.ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని, నిజాలను గ్రహించాలని ప్రతిపక్ష పార్టీలను హెచ్చరించారు.