తాండూర్ అభివృద్ధికి నూతన దిశ – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత
రోడ్లు, నీరు, విద్యలో పురోగతి – తాండూర్‌లో అభివృద్ధి దిశగా అడుగులు
ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న నాయకుడు – మనోహర్ రెడ్డి
తాండూర్ అభివృద్ధికి దార్శనిక నాయకత్వం – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, న్యాయవాది కే. గోపాల్ తెలిపారు.
తాండూర్manasa news :ప్రతినిధి,నియోజకవర్గానికి దార్శనికత కలిగిన ఆదర్శ నాయకుడిగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిలుస్తున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, న్యాయవాది కే. గోపాల్ తెలిపారు. గతంలో ఎన్నో సంవత్సరాలుగా తాండూర్ ప్రజలు పలువురు నాయకులను చూసినప్పటికీ, అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని కట్టుబడి పనిచేస్తున్న నాయకుడిగా మనోహర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ముఖ్యంగా గత పాలకుల కాలంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్ల అభివృద్ధిని, ఎన్నికైన కొద్ది కాలంలోనే మెరుగుపరచడం ఆయన నాయకత్వానికి నిదర్శనమని వెల్లడించారు.తాండూర్–వికారాబాద్ ప్రధాన రహదారి అభివృద్ధి ప్రజల ప్రశంసలు అందుకోగా, సుమారు ₹18 కోట్లతో తాండూర్ పట్టణంలోని అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అలాగే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం సమగ్ర ప్రణాళిక (DPR) సిద్ధం చేసి ముఖ్యమంత్రికి సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు.కాగ్నా నుండి తాండూర్‌కు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సుమారు ₹30 కోట్లతో ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. విద్యా రంగంలో భాగంగా ATC సెంటర్‌ను రాబట్టడం, డిగ్రీ కాలేజీకి నూతన భవనం నిర్మాణం వంటి చర్యలు తీసుకున్నారని వివరించారు.గ్రామీణ ప్రాంతాల్లో వందలాది కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టి, అసెంబ్లీలో తాండూర్ సమస్యలను లేవనెత్తి మంత్రుల వద్ద బలమైన వాదనలు వినిపిస్తున్నారని తెలిపారు. హంగులు, ఆర్భాటాలకు దూరంగా అభివృద్ధినే లక్ష్యంగా తీసుకుని నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూర్ ప్రజలకు నిజమైన ఆదర్శ నాయకుడని కే. గోపాల్ అభిప్రాయపడ్డారు.

