ఆర్టీసీ కార్మికులకు న్యాయం – సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
కండక్టర్లు, డ్రైవర్లకు భారీ వేతన పెంపు
రిటైర్డ్ కార్మికులకు కూడా లాభం – సీఎం కీలక నిర్ణయం
37 వేల మందికి లాభం – ఆర్టీసీ వేతన సవరణకు గ్రీన్ సిగ్నల్
ఆర్టీసీ కార్మికులకు బిగ్ రిలీఫ్ – వేతన సవరణ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తాండూరు: manasa news ప్రతినిధి,రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ ప్రకటించడం పట్ల తాండూరు డిపోకు చెందిన రిటైర్డ్ మరియు ప్రస్తుత ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ వేతన సవరణ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 37,360 మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది. 2021 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న ఈ నిర్ణయం రిటైర్ అయిన కార్మికులకు కూడా వర్తించనుంది.ఈ సందర్భంగా డిసిసి అధికార ప్రతినిధి, న్యాయవాది గోపాల్ మాట్లాడుతూ, వేతన సవరణ వల్ల కండక్టర్లకు రూ.4,000 నుంచి రూ.15,000 వరకు, డ్రైవర్లకు రూ.4,000 నుంచి రూ.17,000 వరకు వేతనాలు పెరిగే అవకాశం ఉందన్నారు. మొత్తం రూ.2,400 కోట్ల ఆర్థిక భారం ఉన్నప్పటికీ, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.గత ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ నిర్లక్ష్యానికి గురై నష్టాలు పెరిగాయని, ప్రస్తుత పరిస్థితులకు అప్పటి విధానాలే కారణమని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో ఆర్టీసీ అభివృద్ధి దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ₹4,538 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా అభివృద్ధి చేయడం, తొలగించబడిన 244 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం వంటి చర్యలు దీనికి ఉదాహరణలని తెలిపారు.ఈ సందర్భంగా వేతన సవరణ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆర్టీసీ కార్మిక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అబ్దుల్ జబ్బర్, తుకారాం, అనంతయ్య తదితర ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

