శర్మకు పైలెట్ రోహిత్ రెడ్డి నివాళులు

ప్రేమ్ కుమార్ శర్మకు పైలెట్ రోహిత్ రెడ్డి నివాళులు

కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి

పప్పీ సేట్ కుటుంబాన్ని పరామర్శించిన పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు, manasa news :తాండూరు పట్టణంలోని TPHS స్కూల్ కరస్పాండెంట్ కీర్తి శర్మ భర్త ప్రేమ్ కుమార్ శర్మ (పప్పీ సేట్) మృతి చెందడంతో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వారి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీశైల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, మాజీ జడ్పీటీసీ ప్రమోదిని, శకుంతల, సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.