ప్రవక్త మహాత్మ్యం స్మరణతో మిలాద్ వేడుకలు అంగరంగ వైభవంగా
పట్టణమంతా ఉత్సవ వాతావరణం – దీపాలతో మెరిసిన వీధులు
🌙 ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా శాంతి, సత్యనిష్ఠతో జీవించాలని పిలుపు
ప్రవక్త జీవితాన్ని స్మరించుకున్న ముస్లింలు – ఐక్యత, సౌభ్రాతృత్వం కోసం పిలుపు
అగ్ని జ్వాలా ప్రతినిధి:తాండూర్
కోటపల్లి పట్టణంలో ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులుపాల్గొన్నారు.మహానుభావులు ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం జీవిత చరిత్రను స్మరించుకుని ముస్లిం సమాజం ఐక్యత, సౌభ్రాతృత్వం, శాంతి, సత్యనిష్ఠతో జీవించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పట్టణంలోని మసీదులు, వీధులు, ఇళ్లను దీపాలంకరణతో అలంకరించారు. మిలాద్ శరీఫ్ జలూస్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించగా, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలోసిరాజ్, ఇస్మాయిల్, అయూబ్, రియాజ్, సలీం, ఇబ్రహీం, హైమద్ అలీ, మస్సి, అజీమ్, మొసీన్, సమద్, యూసుఫ్, ఏకబాల్, సర్దార్ ఖాన్ సాబ్, అన్వార్, కిరాణా షాప్ అజీమ్, యాసీన్, హాజీ, అక్రమ్, బాగార్ తదితరులు పాల్గొన్నారు.

