గ్రామ రహదారులపై విద్యార్థుల కోసం ప్రత్యేక హెచ్చరిక
హెల్మెట్ లేకుంటే పాఠశాల ప్రవేశం లేదు!,
రవాణా భద్రతపై తల్లిదండ్రులకు విజ్ఞప్తి
మైనర్ విద్యార్థులకు బైక్ నిషేధం
హెల్మెట్ తప్పనిసరి – ప్రిన్సిపాల్ గాయత్రీ సూచన
అగ్నిజాల ప్రతినిధి: తాండూర్
గొట్లపల్లి గ్రామంలోని టిజి మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గాయత్రీ గారి ఆధ్వర్యంలో విద్యార్థుల రవాణా భద్రతపై ప్రత్యేక హితవు ప్రకటించారు. గ్రామ పరిసర రహదారుల పరిస్థితి సురక్షితం కాకపోవడం, వాహనాల రద్దీ పెరగడం వంటి కారణాల వల్ల విద్యార్థులు పాఠశాలకు రాకపోకల సమయంలో తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.తల్లిదండ్రులు తమ పిల్లలు హెల్మెట్ ధరించి రావడాన్ని నిర్ధారించుకోవాలని, మైనర్ విద్యార్థులు బైక్ నడపకూడదని, బదులుగా సురక్షితమైన రవాణా సదుపాయాలను వినియోగించాలని సూచించారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సిబ్బందికి ఈ మేరకు అవగాహన కల్పించింది.విద్యార్థుల ప్రాణ భద్రత మాకు అత్యంత ప్రాధాన్యం. అందువల్ల రవాణా సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని మనవి” అని తెలిపారు.
