*ప్రొ. జయశంకర్ సార్ ఆదర్శవంతమైన ఆలోచన విధానాన్ని,ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాలి
తెలంగాణ జన సమితి తాండూరు కన్వీనర్ సాంబురు సోమశేఖర్.
అగ్నిజ్వాలా ప్రతినిధి:తాండూర్
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ జన సమితి, విద్యావంతుల వేదిక,వివిధ రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తాండూరు ఇందిరా చౌక్ వద్ద గల జయంశంకర్ సార్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సంధర్బంగా జనసమితి నాయకులు సాంబురు సోమశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై సాగిన ఉద్యమం జయశంకర్ సార్ మార్గదర్శనంలోనే జరిగింది,ఆయన లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతకై గల్లీ నుండి ఢిల్లీ వరకు భావజాల వ్యాప్తి చేసిన చైతన్యమూర్తి జయశంకర్ సార్, నిరంతరం ఆయన ఆలోచన విధానాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి కృషి చేస్తామని, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచం ముందు ఉంచిన జ్ఞాని జయశంకర్ సార్,తెలంగాణ ప్రజల హక్కుల సాధనకై పోరాటానికై స్ఫూర్తినిచ్చిన ఉద్యమ చైతన్యమూర్తి, ఆయన కలలు కన్న ప్రజాస్వామిక తెలంగాణ సాధనకై ప్రభుత్వాలు కృషి చేయాలి లేదంటే పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు.తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజం విజయ్ కుమార్* మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయాలు నేటి తరానికి అనుసరనియ్యం అని, తెలంగాణ ప్రభుత్వం జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా పాలన చేయాలని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని, ప్రజాస్వామిక హక్కుల సాధనకై పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన అన్నారు.విద్యావంతుల వేదిక నాయకులు పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ జయశంకర్ సార్ స్ఫూర్తివంతమైన జీవిత చరిత్ర విద్యార్థులకు బోధించాలి తద్వారా ఆయన ఆలోచన విధానం నేటి తరానికి చేరుతుంది,ఆయన ఆదర్శవంతమైన జీవన విధానం నేటి తరం ఆదర్శంగా తీసుకుంటుంది అని ఆయన అన్నారు.*బీజేపీ నాయకులు బంటారం భద్రేశ్వర్* మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను అందరికీ అర్ధమయ్యేలా వివరించి ప్రజల్ని చైతన్యపరిచి,స్వరాష్ట్ర సాధన ఉద్యమనిర్మాణం చేసిన పోరాట దిక్సుచి జయశంకర్ సార్ ఆయన ఆశయాలకు అనుగుణంగా యావత్ తెలంగాణ సబ్బండ వర్గాలు ప్రజల అభ్యున్నతికి పాలకులు కృషి చేయాలి అని ఆయన అన్నారు.సిఐటియు నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మారడం లేదని, జయశంకర్ సార్ స్పూర్తితో పేద ప్రజలకు ప్రభుత్వ ఫలాలు దక్కి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జిల్లా యువజనుల సర్వీసుల అధికారి హన్మంత్ రావు,బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చారి, టిపిఎల్ఎఫ్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సి. విజయ్ కుమార్, జీలకర రవీందర్,నూరుద్దీన్, సురేష్, జనసమితి నాయకులు గౌరి,సందీప్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

