డైవర్షన్ పాలిటిక్స్ మరియు దొంగ దీక్షలు ఎన్ని చేసినా ప్రజలు బిఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరు
*యూత్ కాంగ్రెస్ తాండూర్ మండల ప్రెసిడెంట్ టి సుధాకర్
అగ్నిజాల ప్రతినిధి :తాండూర్
బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడమే దేయంగా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ ఇటు అసెంబ్లీ అటు మండలి ఉభయసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకొని . రాష్ట్ర గవర్నర్ కు అటు రాష్ట్రపతికి బిల్లును పంపించి కాంగ్రెస్ పార్టీ తన నిజాయితీని నిరూపించుకుంది బీసీ బిల్లుకు రాష్ట్రపతి నుంచి ఆమోదం రాకపోవడంతో మరో ముందడుగు వేసి ఢిల్లీ లోనే తెలుచుకుందామని జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం సైతం చేస్తుంది బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ కు మింగుడు పడక బీసీ ప్రజలను మభ్య పెట్టేందుకు రాష్ట్ర ప్రజలను దృష్టి దారి మళ్లించేందుకు కొత్త నాటకం మొదలుపెట్టారు. కాలేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ జస్టిస్ ఫియాష్ గోష్ ఇచ్చిన నివేదిక తప్పు అంటూ బిఆర్ఎస్ నాయకులు కొత్త నాటకం మొదలుపెట్టారు మరోపక్క బీసీలకు 42% రిజర్వేషన్ కోసం నేనొక్కదాన్నే పోరాడుతున్నాను అనే విధంగా 72 గంటల దీక్ష అంటూ కేసిఆర్ కూతురు కవిత దొంగ దీక్షలు మొదలుపెట్టింది. ఇలాంటి ఫ్యామిలీ డ్రామాల అని మండిపడ్డారు