లొంక నర్సిములుని పరామర్శించిన ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులుకాసాని వీరేష్
–ఎల్ ఎన్ ఆర్ యువసేన వ్యవస్తాపకులు, కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షులు లొంక నర్సిములు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వీరేష్
అగ్నిజ్వాల ప్రతినిధి:తాండూర్
ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు , సంఘం రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్ బుధవారం వికారాబాద్ జిల్లా తాండూర్ లో ఎల్ ఎన్ ఆర్ యువసేన వ్యవస్తాపకులు, కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షులు లొంక నర్సిములు పరామర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి..వారికి వైద్య సేవలు అందిస్తూ, ప్రజాసేవే ధ్యేయంగా నిరంతరం పోరాడుతున్న లొంక నర్సిములు సేవలు అభినందనీయమని అన్నారు. మోకాలి ఆపరేషన్ తర్వాత విశ్రాంతిలో ఉన్న ఆయన నివాసానికి చేరుకుని త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మరో వైపు.. కాసాని వీరేష్ నాయకుడు మాత్రమే కాక, ప్రజలకు అండ గా నిలుస్తూ అందరికీ ఆదర్శం గా నిలుస్తున్నారని తాండూర్ నియోజవర్గం ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తెలి పారు. అన్ని వేళలో సంఘం కోసం, సమాజం కోసం అంకిత భావంతో వీరేష్ పనిచేస్తూ ముందుకు పోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరామర్శించిన వారిలో ముది రాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ,తాండూర్ నియోజక వర్గం సంఘం అధ్యక్షులు ఎస్పి రవికాంత్, శ్రీకాంత్, జర్నప్ప , అంబ్రెష్, లొంక రాములు తది తర సంఘం ప్రతినిధులు ఉన్నారు.