సమాజ సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ నాయకత్వం!
రేషన్ పంపిణీలో పారదర్శకత – గ్రామస్థుల మదిలో నిలిచిన కాంగ్రెస్ నాయకత్వం!
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాలతో హన్మాపూర్‌లో రేషన్ సంబరం
రేషన్ కార్డు పంపిణీ తో ప్రజల
మన్ననలు పొందిన లొంక నర్సింహులు!
అగ్నిజ్వాల ప్రతినిధి :పెద్దేముల్
హన్మాపూర్ గ్రామం మరోసారి అభివృద్ధి పథంలో ముందుకు సాగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రజా సంక్షేమానికి ప్రధాన ప్రాధాన్యత ఇస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , మన నియోజకవర్గ ప్రజల ఆదర్శ నాయకులు ఎమ్మెల్యే బ్యూయనీ మనోహర్ రెడ్డి గ్రామ అభివృద్ధికి నిబద్ధతతో పని చేస్తున్నారు.ఈ మార్గదర్శకతలో భాగంగా, లొంక నర్సింహులు నిరంతర శ్రమతో, హన్మాపూర్ గ్రామంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. గ్రామస్థుల కోసం ఎప్పుడూ ముందుండే ఆయన సేవలు ప్రశంసనీయం.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ నర్సింహులు, రేషన్ డీలర్ శ్రీనివాస్ కృషి చేశారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తూ, సేవా మార్గంలో కొనసాగుతున్న లొంక రాములు, లొంక వెంకటేష్, లొంక మహిపాలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త రేషన్ కార్డులు స్వీకరించారు. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరేలా చేసిన ఈ చొరవ పట్ల గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.