మంగళవారం నుంచి శాంతి యుత నిరసన

ఎన్ హెచ్ – 167 బాధితులకు నష్ట పరిహారం (కంపెన్సేషన్ ) చెల్లించాలి 

మంగళవారం నుంచి శాంతి యుత నిరసన

జిల్లా కలెక్టర్ స్పందించి బాధితులకు న్యాయం చేయాలి 

అగ్నిజ్వాలా ప్రతినిధి: తాండూర్

తాండూర్: ఎన్ హెచ్ – 167 కమర్షియల్ ప్లాట్లు ఎనిమిది మంది బాధితులందరికీ న్యాయం చేసి, వారికి వెంటనే నష్ట పరిహారం (కంపెన్సేషన్ ) చెల్లించాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా బాధితులు నరేష్, నారాయణ తదితరులు మాట్లాడుతూ.. కంపెన్సేషన్ డబ్బులను మార్కెట్ రేటు పై బాధితులందరికి చెల్లించాలని అన్నారు. ఎనిమిది మందికి గజాల లెక్క మాదిరిగా బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని విన్నవించారు.జిల్లా కలెక్టర్ , స్థానిక ఎమ్మెల్యే స్పందించి కమర్షియల్ ప్లాట్లు ఎనిమిది మంది బాధితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అదేవిదంగా బాధితులందరితో కలిసి మంగళవారం నుంచి శాంతి యుతంగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వారు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *