*గణేష్ ఉత్సవాలలో మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం
*మట్టి వినాయకుల వినియోగం ద్వారా కుమ్మరి వారికి ఉపాధి లభిస్తుంది
*కాగ్నా నది మరియు ప్రకృతిని రక్షించడం కర్తవ్యంగా భావిద్దాం
–బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్‌కుమార్ కందుకూరి
అగ్నిజ్వాలా ప్రతినిధి:తాండూర్
ప్రతి ఇంట్లో, అలాగే తాండూర్‌లోని వినాయక మండపాల్లో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించలి అని కుమ్మరి కుల అభ్యున్నతికి, అలాగే తాండూర్ ప్రజలకు తాగునీటి వనరుల కాగ్నా నదీ కాలుష్యం నివారణకు తోడ్పడుతుంది అని బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్‌కుమార్ కందుకూరి అన్నారు ఈ రోజు మధ్యాహ్నం రాజ్ కుమార్ తాండూర్ దస్తగిరిపేట గ్రామం సందర్శించి, ఎన్నో ఏళ్లుగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్న కుమ్మరి శంకర్ కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంలో రాజ్‌కుమార్ మాట్లాడుతూ, “మట్టి వినాయక విగ్రహాల వినియోగం ద్వారా ఈ వృత్తిపైన ఆధారపడే ప్రజలకు ఉపాధి లభిస్తుంది.కుమ్మరి కులానికి మేలు జరుగుతుంది. కాగ్నా నది కాలుష్యం తగ్గుతుంది. అంతేకాక, ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాల కంటే తక్కువ ఖర్చుతో లభిస్తాయి అని తెలిపారు.శంకర్ కుటుంబం సహా తాండూర్ పరిసర ప్రాంతాల్లోని అనేక మంది కుమ్మరి కుటుంబాలు 8 అంగుళాల నుండి 5 అడుగుల వరకు వివిధ పరిమాణాలలో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. కొనుగోలు చేయదలచిన వారు నేరుగా శంకర్‌ను9908876875సంప్రదించవచ్చు.గత ఒక నెలగా తాండూర్‌లో ప్లాస్టర్ అఫ్ పారిస్ వినాయక విగ్రహాలను ప్రతిష్టించవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని రాజ్‌కుమార్ తెలిపారు. ఈ విషయంపై హిందూ సంఘటన్ తరఫున తాండూర్ ఎమ్మెల్యే బయ్యాని మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహా రెడ్డి లను కలిసి మద్దతు కోరినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకుడు సయ్యద్ షుకూర్, జిల్లా బీసీ నాయకుడు గడ్డం వెంకటేష్, జిల్లా మహిళా నాయకురాలు నర్సమ్మ, బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు మంజుల, పెద్దేముల్ యువజన అధ్యక్షుడు నవీన్, బషీరాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ అయ్యా, యువజన అధ్యక్షుడు సిద్ధార్థ్ గౌడ్, బీసీ యువజన నాయకులు రాము ముదిరాజ్, వివేక్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

