42% బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో చట్టం చేయాల్సిందే. 

సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ డిమాండ్

*42% బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో చట్టం చేయాల్సిందే. 

అగ్నిజ్వాలా ప్రతినిధి:తాండూర్

తాండూర్ పట్టణo లో సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి అమలు చేయాల్సిందేనని, కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు*. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం చేసి వెంటనే అమలు చేయాలని, తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ తీర్మానం చేసి 42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రానికి ఆమోదం కోసం పంపిందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ 42 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో చట్టం చేయకుండా రిజర్వేషన్లకు మతం రంగు పులుముతున్నదని విమర్శించారు. రిజర్వేషన్లు ఇచ్చేది మత ప్రాతిపాదికన కాదని, వెనుకబడినవర్గాలకుఆర్థిక,రాజకీయ,సామాజిక సమాన అవకాశాలు కల్పన కోసం అన్న అంశాన్ని బిజెపి పక్కన పెడుతుందని విమర్శించారు. విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో సమానత్వాన్ని నిరాకరిస్తున్నదని,అందుకే బీజేపీ బీసీ రిజర్వేషన్లను పక్కన పెట్టాలని భావిస్తుందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో అమలు చేస్తున్న రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మత ప్రతిపాదికన ప్రజలను విభజించడం కోసం రిజర్వేషన్లను మతానికి పరిమితం చేస్తున్నారని విమర్శించారు. చట్ట సవరణ చేసి భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని, ఆ దిశగా బీసీ రిజర్వేషన్లకు సైతం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ సాయుధ రైతంగా పోరాట పురిటిగడ్డ తెలంగాణలో బిజెపి విభజన, విద్వేష రాజకీయాలను తెలంగాణ సమాజం అంగీకరించదన్నారు. రాష్ట్రంలోని బిజెపి నాయకులు సైతం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వెంటనే వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సైతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తున్నదని అన్నారు.బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలని సిపిఎం పోరాడుతుంటే,సిపిఎం నాయకులను రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధాలను కొనసాగిస్తున్నదని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వంపై రిజర్వేషన్ల సాధనకై రాజీలేని పోరాటాలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు.ఆ ఆ దిశగా అఖిల పక్ష రాజకీయ పార్టీలను కలుపుకొని కేంద్రం పై పోరాడాలన్నారు.బీసీ రిజర్వేషన్ ల కోసం చేసే పోరాటంలో రాజిపడే ప్రసక్తే లేదన్నారు., బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని,తక్షణమే 42 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. బడుగు బలహీనవర్గాలకు రిజర్వేషన్ల ద్వారా అందుతున్న కొద్దిపాటి సహాయాన్ని సైతం నిర్వీర్యం చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుటిల యత్నాలను ప్రజల ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరారు. కుల గణన జరపాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తుప్పటికీ,నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తున్న బిజెపికి ప్రజా పోరాటాల ద్వారా బుద్ధి చెప్పాలని ఆ దిశగా పోరాడుతున్న సిపిఎం పార్టీకి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కే చంద్రయ్య సిపిఎం నాయకులు కృష్ణ ఆశీర్వాదం బస్వరాజ్ ప్రజాసంఘాల జిల్లా నాయకులు G రత్నం నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *