ఆంజనేయ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం”

*స్వామి కృపాకటాక్షం పొందే పుణ్యసమయం – తప్పక తరలి రండి!

* వీరాంజనేయ స్వామి దివ్య దర్శనం – జాదవ్ దంపతుల ఆహ్వానం!

*పెద్దెముల్ తండా చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచే ప్రతిష్ఠాపన మహోత్సవం!

*ప్రజాభిమానం సొంతం చేసుకున్న జాదవ్ ధారసింగ్ – తారాబాయి దివ్య ప్రతిష్ఠాపన వైభవం!

అగ్నిజ్వాలా ప్రతినిధి:పెద్దేముల్

పెద్దెముల్ తండా (వికారాబాద్ జిల్లా):

ఆధ్యాత్మిక మహోన్నతికి నిలయంగా, భక్తి భాస్కర కాంతులతో ప్రకాశించబోతున్న పెద్దెముల్ తండా చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహోత్సవానికి సాక్ష్యం కానుంది. ప్రజల నిత్యభక్తి, సేవా తపస్సుకు ప్రతీకగా, శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 14, 15 ఆగస్టు 2025 తేదీల్లో అఖండ వైభవం, అపార భక్తి ఘనతలతో అలరించబోతోంది.సమాజ సేవలో అగ్రగాములు, ప్రజా హృదయాలలో విశేష స్థానం సంపాదించిన శ్రీమతి జాదవ్ తారాబాయి శ్రీ జాదవ్ ధారసింగ్ (మాజీ జెడ్పీటీసీ, పెద్దెముల్ మండలం, టి.వి.సి.సి. ప్రథాన కార్యదర్శి) తమ నిరంతర కృషి, అపార భక్తి శ్రద్ధతో ఈ పుణ్యకార్యాన్ని సాకారం చేస్తున్నారు. వారి ఆత్మీయ సమర్పణ, సేవాస్ఫూర్తి, గ్రామానికి శాశ్వత ఆధ్యాత్మిక శోభను అందించనుంది.ఈ మహోత్సవంలో రెండు రోజులపాటు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, ఆలయ కళ్యాణాలు, భక్తి కార్యక్రమాలు వైభవంగా జరుగనున్నాయి. శ్రీ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ లభించాలనే సంకల్పంతో, నిర్వాహకులు భక్తులను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *