వేసవిలో పుచ్చకాయ ఎంతో మేలు
తాండూర్ :అగ్నిజ్వాల ప్రతినిధి :
పోషకాల పవర్ హౌస్ :పుచ్చకాయలో ఉండే పోషక విలువల్లో ఎక్కువ భాగం వాటి గింజల నుంచే లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా వీటిలో ప్రొటీన్లు, విటమిన్స్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయంటున్నారు. కాబట్టి వీటిని తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.గుండె జబ్బులను తగ్గిస్తాయి : పుచ్చకాయ గింజల్లో మోనో అన్‌శ్యాచురేటెడ్, పాలీ అన్‌శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండె నొప్పి, గుండెపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాకుండా, ఈ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.2020లో “Journal of the American College of Cardiology” అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. పుచ్చకాయ గింజలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయని వెల్లడైంది. ఈ పరిశోధనలో యూఎస్ఏలోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్ కి వాంగ్ పాల్గొన్నారు. పుచ్చకాయ గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి :పుచ్చకాయ గింజలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా మీ జీర్ణక్రియను మెరుగుపరచుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం ద్వారా జీర్ణశక్తిని పెంచుకోవడమే కాకుండా గట్ సిస్టమ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు.రోగనిరోధక శక్తిని పెంచుతాయి :పుచ్చకాయ గింజలు జింక్, విటమిన్ సి వంటి రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ గింజలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

