శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

 

శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

 

రేణుక శాంతి కుమార్ దంపతుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

 

తాండూర్ ::అగ్నిజ్వల ప్రతినిధి :

 

వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

యాలాల మండల పరిధిలోని జుంటుపల్లి గ్రామంలో రేణుక శాంతి కుమార్ దంపతుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. మంగళ వాయిద్యాలు పేద మంత్రాల నడుమ అర్చకులు బిచ్చయ్య స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. మహామండపంలో పార్వతీ, పరమేశ్వరులను పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాలు, వజ్రాభరణాలు, వివిధ రకాల పూలమాలలతో దివ్యమనోహరంగా అలంకరించి ప్రత్యేకసేవలో తీర్చిదిద్దారు. అలంకార సేవ, శివపార్వతుల కల్యాణ పట్టువస్త్రాలను వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాలతో తిరువీధుల్లో ఊరేగించిన అర్చకులు దేవాలయ బాహ్యప్రాకార మండపంలోని కల్యాణమండపంలో వేదికపై అధిష్ఠింపజేశారు. సకల విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడికి తొలిపూజలతో అర్చకులు కల్యాణతంతు ప్రారంభించారు. నూతన వధూవరులు పర్వతవర్ధినీ అమ్మవారు, రామలింగేశ్వరుడికి కల్యాణ పట్టు వస్త్రాలను అందజేశారు. పరమేశ్వరుడికి యజ్ఞోపవీతధారణ పర్వాలు జరిపిన అర్చకులు జీలకర్రబెల్లం, కన్యాదానతంతు నిర్వహించారు. వేదపండితులు నిర్ణయించిన సుముహూర్తంలో అమ్మవారి మెడలో పరమేశ్వరుడు మాంగల్యధారణ చేశారు. స్వామి, అమ్మవార్ల శిరస్సులపై ముత్యాల తలంబ్రాలను అర్చక, వేద పండితులు వేదోక్త పఠనాల నడుమ అలంకరింపజేసే ఆధ్యాత్మిక ఘట్టాలు భక్తుల జయజయ ధ్వానాల నడుమ వైభవంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో గురు స్వామి నరసింహులు, శివ స్వామి, మాధవరెడ్డి తదితరు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *