రామరాజ్యం ముసుగులో చిల్కూర్ ప్రధాన
అర్చకుడి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మూడు నెలల్లో
నిందితులను కఠినంగా శిక్షించాలి
ప్రజాసంఘాల డిమాండ్ చేశారు
తాండూర్అ : అగ్ని జ్వాలా ప్రతినిధి
తాండూర్ పట్టణం లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో లో చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ప్రధాన అర్చకుడి పై జరిగిన దాడిని ఖండిస్తూన్నాము *సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు కే చంద్రయ్య మాట్లాడుతూ* రామరాజ్య ముసుగులో రౌడీ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ తిరుపతి గా పేరుగాంచిన బాలాజీ టెంపుల్ అతి ప్రసిద్ధమైనదని ఆలయ అభివృద్ధి కోసం రంగరాజన్ ఎంతో కృషి చేశారు రంగరాజన్ లౌకికవాది, ప్రజాస్వామ్యవాది పరమత సహనం కలిగిన వ్యక్తి అని అలాంటి వ్యక్తిపై మతోన్మాదులు దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు ముఖ్యంగా రంగరాజన్ పై దాడికి పాల్పడిన వ్యక్తులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మూడు నెలలలోనే కఠిన చర్యలు తీసుకోవాలని పూజారులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మతోన్మాదం పేరుతో దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రంగరాజన్ పరామర్శించి మద్దతు తెలియజేసినరు కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గోపాల్ కృష్ణ శేఖర్ తదితరులు పాల్గొన్నారు

