*శ్రీ చైతన్య సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్*
చైతన్య విద్యాసంస్థలు మరొక అరుదైన ఘనతను చాటుకున్నాయి .భారతదేశంలోని 20 రాష్ట్రాల నుండి పదివేల మంది శ్రీ చైతన్య విద్యార్థులు 600 గణిత సూత్రాలను ఏకకాలంలో పటించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
గ
తంలో రెండు పర్యాయాలు శ్రీ చైతన్య విద్యార్థులు ప్రపంచ రికార్డును సాధించారు 2018లో ప్రపంచ దేశాల పటాలు- భౌగోళిక అవగాహన ,2023లో 100 నిమిషాల్లో 1 నుంచి 100 మ్యాచ్ టేబుల్స్ పటించడం ద్వారా రెండుసార్లు వరల్డ్ రికార్డు సొంతం చేసుకోగా. ఈ సారి మూడు గంటల వ్యవధిలో 600 గణిత సూత్రాలు పటించి సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డును సాధించారు.
ఈ కార్యక్రమం హైదరాబాదులో టెలివిజన్ ఛానళ్ళ ప్రత్యక్ష ప్రసారంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధుల సమక్షంలో శ్రీ చైతన్య స్కూల్స్ అకాడమిక్ డైరెక్టర్ సీమా బొప్పన ఆధ్వర్యంలో శ్రీ చైతన్య సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రుల వీక్షణలో ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది.
ఇట్టి ఘనతకు కారణమైన విద్యార్థులను, ఉపాధ్యాయులను, మరియు తల్లిదండ్రులను తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎంలు , ప్రిన్సిపాళ్ళు ,అకాడమిక్ కోఆర్డినేటర్లు, సెంట్రల్ ఆఫీస్ సిబ్బంది అభినందించారు.

