బషీరాబాద్ బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా సోమిషెట్టి జగదీశ్వర్
బషీరాబాద్ యూత్ ప్రెసిడెంట్ గా సిద్ధార్థ గౌడ్ నియామకం
బీసీ సామాజిక ఉద్యమం ప్రతీ గడపకు చేరాలి
–జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు లో నిర్వహించిన ఇట్టి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ మరియు రాష్ట్ర నాయకులు సయ్యద్ శుకూర్, బీసీ సంఘం మండల అధ్యక్షులు నరేందర్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకోవడం జరిగింది నూతనంగా పదవీ బాధ్యతలు తీసుకోవడం చాలా గర్వంగా ఉంది మరియు బీసీల అభ్యున్నతి కోసం పోరాటం కొనసాగిస్తాం అని వారు వ్యాఖ్యానించడం జరిగింది.
కందుకూరి రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ ఆర్. కృష్ణయ్య మొదలుపెట్టిన ఈ సామాజిక ఉద్యమం ప్రతీ గడపకు చేరి బహుజన వర్గాలలో రాజ్యాధికార కాంక్షను రగిలించి రాబోయే రోజుల్లో రాజ్యాధికారాన్ని సాధిస్తుంది అని వారు పునరుద్ఘాటించారు
ఇట్టి కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయీద్ శుకూర్బీసీ సంఘం బషీరాబాద్ మండల అధ్యక్షులు నరేందర్ యాలల మండల అధ్యక్షులు లక్ష్మణ్ చారి, బషీరాబాద్ మహిళా అధ్యక్షురాలు వీరమని, దేవనూర్ మాజీ సర్పంచి ఆకుల శివకుమార్, గోనూర్ రాములు,
అరుణ్ రాజ్, చల్లా హరి,తదితరులు పాల్గొన్నారు.

