తాండూర్ అగ్నిజాల ప్రతినిధి
యాలాల మండల పరిధిలోని
గిరిజాపూర్ గ్రామంలో శ్రీ నాగుల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం, బోనాల కార్యక్రమం మంగళవారం
నాగుల పోచమ్మ
ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు యువకులు ఆధ్వర్యంలో
ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు గ్రామస్తులు, గ్రామ పెద్దలు పాల్గొని పూజలు చేశారు. మంగళవారం బోనాలతో మహిళలు ఊరేగింపుగా బయలుదేరి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో దౌలాపూర్ తాజా మాజీ సర్పంచ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ రాములు, జనార్దన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రఘు రెడ్డి,
రాములు, లక్ష్మయ్య, బి.వెంకటేష్, రాంచందర్ గౌడ్, అనంతప్ప, సూరి, ఫకిరప్ప, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

