పురాతన బావిని కాపాడండి సిఐటియు 

పురాతన బావిని కాపాడండి సిఐటియు

తాండూర్ అగ్నిజాల ప్రతినిధి :

 

జోగులాంబ గద్వాల జిల్లాలో పురాతన బావిని చింతలపేట పక్కన, బాయ్స్ హై స్కూల్ కి ఎదురుగా, కళ్లుగేరు వెనకాల రాజుల కాలం నాటి బావిని ఆక్రమించుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ జి. వేణుగోపాల్ అనే వ్యక్తి నుండి భావిని కాపాడాలని అతనికి సహకరించిన అధికార రాజకీయ నాయకులను మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ జి.వేణుగోపాల్ ను వెంటనే అరెస్టు చేసి చట్ట పరంగా శిక్షించాలని జోగులాంబ గద్వాల జిల్లాలోని సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు కే మోహన్ రావు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు శంకర్ ప్రభాకర్ నాగన్నలు . టిఆర్ఎస్ నాయకులు. నాగరదొడ్డి వెంకట రాములు, గంజిపేట రాజు, కురువపల్లయ్య, శ్రీరాములు.JAC నాయకులు మధుసూదన్ బాబు అడ్వకేట్. Cpi ml నాయకులు దానయ్య. PDSU విద్యార్థి నాయకులు హలీం పాషా. IFTU కార్మిక నాయకులు జమ్మచెడు కార్తీక్ . పౌరహక్కుల నాయకులు సుభాన్ ,బహుజన రాజ్యసమితి నాయకులు వినోద్,వాల్మీకి, కోళ్ల ఉషన్.సిపిఐ నాయకులు ఆంజనేయులు. సిపిఎం నాయకులు వెంకటస్వామి, సిఐటియు కార్మిక నాయకులు నరసింహ . ఏఐటీయూసీ కార్మిక నాయకులు ఎల్కూర్ రంగన్న .TNSF విద్యార్థి నాయకుడు ఉప్పేరు సుభాన్. అడ్వకేట్స్ శ్యామ్, షఫీ ఉల్లా. దళిత సంఘాల నాయకులు మోహన్. రైతాంగ సమితి నాయకులు గోపాల్, జక్కుల వెంకటయ్య  మరియు రిక్షా కార్మికులు పాల్గొని పురాతన బావిని కాపాడే దాకా పోరాడుతూనే ఉంటామని ఆయా నాయకులు ర్యాలీ కార్యక్రమంలో ఆయా పార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

ప్రస్తుతం మట్టి వేసి పూడ్చిన కొత్త బావిని తిరిగి మాజీ మున్సిపల్ చైర్మన్ వేణుగోపాల్ పూడిక తీసేంతవరకు(మట్టిని తీసేంతవరకు) ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తూనే ఉంటాం. లేనియెడల గద్వాల పట్టణంలో ఇల్లు ఇల్లు తిరిగి అంగడి అంగడి తిరిగి చిల్లర అడుక్కుని మాజీ మున్సిపల్ చైర్మన్ జి.వేణుగోపాల్ ఇంటి ముందర చల్లి వస్తామణి ఆయా నాయకులు ఆవేదనతో మనోవేదనతో ఆక్రోషంతో మాట్లాడారు.

గద్వాల పట్టణ ప్రజలు ఇలాంటి విషయాలలో ఎప్పటికప్పుడు కబ్జాదారులను ప్రశ్నిస్తూ ఎదిరిస్తూ ఉండాలని కూడా ఆయా సంఘాల పార్టీ నాయకులు ఓ పక్క CITU కార్మిక సంఘ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లకు ఇచ్చిన న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని జోగులాంబ గద్వాల జిల్లాలో ఆశ వర్కర్లు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *