బీసీ సంక్షేమానికి 25 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించాలి

బీసీ సంక్షేమానికి 25 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించాలి

 

నిరుద్యోగ యువత రుణాలకు అదనపు బడ్జెట్ పెట్టాలి

బీసీ కార్పొరేషన్లకు ఫెడరేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

గురుకుల పాఠశాలలకు హాస్టళ్లకు సొంత భవనాల నిర్మాణానికి బడ్జెట్ కేటాయించాలి

పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్లకు బడ్జెట్ ను విడుదల చేయాలి

జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్

 

తెలంగాణ అసెంబ్లీలో ఈనెల 19న ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 25 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు రాజ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు పెద్ద పిట్ట వేయాలని గతంలో ఉన్న 12 కార్పొరేషన్లతోపాటు కొత్తగా ఏర్పాటు అయిన కార్పొరేషన్లకు ఫెడరేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించి వాషర్ మాన్,ఉప్పర,కృష్ణబలిజ పూసల,కుమ్మర,విశ్వబ్రాహ్మిన్స్,ముదిరాజ్,తాడి టాపర్స్,నాయి బ్రాహ్మిన్,వడ్డెర,బోయ వాల్మీకి, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా నిధులు విడుదల చేసే పూర్తి అధికారాన్ని సొసైటీకి ఇవ్వాలని వాటి ద్వారా సంక్షేమానికి నిధులు విడుదల చేస ఆ కులాల వారికి న్యాయం చేయాలని రాజ్ కుమార్ కోరారు అదేవిధంగా గత ఏడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్లీ స్కాలర్షిప్లకు పూర్తి బడ్జెట్ కేటాయించి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు రాష్ట్రంలో ఉన్న 490 బీసీ హాస్టళ్లకు నూతన ఆధునితమైన భవనాలు నిర్మించాలని గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు ఏర్పాటుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని నిరుద్యోగ యువతి యువకులకు బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాల మంజూరుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *