యువత రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగదు*

*యువత రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగదు

*మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు కదులుదాం

*చరిత్రను తిరగ రాసే శక్తి యువతకుంది

*ఐక్యంగా పోరాడుదాం బిసి హక్కులను సాధించుకుందాం

జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ 

*యువజన సంఘం అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో బిసి యువజన కార్యవర్గ సమావేశం

అగ్నిజాల ప్రతినిధి: తాండూర్

యువకులు రాజకీయ పార్టీ నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు & తాండూర్ నియోజవర్గ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు నేటి ఉదయం పెద్దముల్ మండల గోట్లపల్లి గ్రామంలో మండల యువజన బీసీ సంఘం అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల బీసీ కార్యవర్గ సమావేశంలో రాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు

 

యువత దురుఅలవాట్లకు దూరంగా ఉండాలని సమాజానికి యావత్తు బీసీ యువత ఆదర్శంగా నిలిచే విధంగా బీసీ ఉద్యమాలు చురుకుగా పాల్గొనాలని దేశంలో హక్కుల కోసం పోరాడి చరిత్రను తిరిగా రాసే శక్తి యువతకుందని విద్యార్థుల నుండి రాజకీయల వరకు బీసీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని బీసీ యువత ముందుకొచ్చి పోరాడాలని రాజ్ కుమార్ అన్నారు

 

బీసీ సమస్యలపై జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేసి విజయం సాధించామని గ్రామంలో ఉన్న యువకులు బిసి మండల అధ్యక్షులు నవీన్ కు అండగా నిలవాలని రాజ్ కుమార్ కోరారు రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్ బిసి మండల అధ్యక్షులు శ్రవణ్ కుమార్ రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్ బిసి మహిళా మండల అధ్యక్షురాలు శివ లీల బిసి నియోజకవర్గం నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఐక్యమత్యంతో పోరాడితే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమే అని అందుకు గ్రామస్థాయి నుండి విద్యార్థులు యువకులు, పెద్దల వరకు బీసీ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు

ఈ కార్యక్రమంలో బహుజన యువ విద్యావేత్త అరుణ్ రాజ్ సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్ మల్లన్న నారాయణ,చంద్రప్ప, గోరే పటేల్ ,రఫీక్ ,రామ్ రెడ్డి ఇస్మాయిల్ ,కురువ శేఖర్ ,కురువ శ్రీశైలం తలారి గోరెప్ప, ఇర్ఫాన్, వెంకటేష్ మొగులప్ప, జనార్ధన్ ,బాలరాజ్, అంజి, రాములు, లక్ష్మప్ప, శీను, సాయిలు ఫయాజ్ ,రియాజ్ ,ఆసిఫ్, చంద్రమ్మ నరసమ్మ, గంగమ్మ, బసమ్మ,చంద్రమ్మ, మారుతమ్మ, పద్మమ్మ ,వెంకటమ్మ, సరోజన, పీరంబీ ,రోషన్బి ,ప్రవళిక

తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *