కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన

 

 

ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కార్మికుల డిమాండ్

10 నెలలుగా జీతాలు లేవు.. హాస్టల్ వర్కర్స్ ఆవేదన

పెండింగ్ జీతాల కోసం కలెక్టర్ కార్యాలయం ముందు హాస్టల్ వర్కర్స్ నిరసన

హాస్టల్ వర్కర్స్‌కు 10 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి : సిఐటియు

 

manasa news ప్రతినిధి వికారాబాద్ జిల్లా హాస్టల్ వర్కర్స్‌కు 10 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి : సిఐటియుసిఐటియు వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన ఆశ్రమ హాస్టళ్లలో పనిచేస్తున్న హాస్టల్ వర్కర్స్ సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజన ఆశ్రమ హాస్టళ్లలో పని చేస్తున్న హాస్టల్ వర్కర్స్‌కు 10 నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ వర్కర్స్‌కు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.అలాగే సీనియారిటీ ఆధారంగా కార్మికులను పర్మినెంట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం రెండు జతల యూనిఫామ్స్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బుస చంద్రయ్య, హాస్టల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాములు, కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.