శుభకార్యాల్లో ఎమ్మెల్యే సందడి

 

శుభకార్యాల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మనోహర్ రెడ్డి

వివాహాలు, గృహప్రవేశం, జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందడి

ప్రజల ఆనందాల్లో భాగమైన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు నియోజకవర్గంలో పలు శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు, manasa news ప్రతినిధి :తాండూర్ నియోజకవర్గంలో జరిగిన పలు శుభకార్యాల్లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులకు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.కోట్పల్లి మండలం లింగంపల్లి గ్రామంలో పూడూరు భాస్కర్ రెడ్డి సోదరుని వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అలాగే కోట్పల్లి వాస్తవ్యులు ఉప్పరి నర్సింలు కుమార్తె వివాహ వేడుకలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.తాండూరు పట్టణంలోని వీరశైవ ఫంక్షన్ హాల్‌లో బెల్కటూర్ వాస్తవ్యులు పత్తి జగదీశ్వర్ కుమారుని వివాహ వేడుకలో, ఆర్యవైశ్య భవన్‌లో సీనియర్ నాయకులు లొంక నర్సింలు మేనల్లుడు వివాహ వేడుకలో పాల్గొన్నారు. తులసి గార్డెన్స్‌లో సాయిపూర్ వాస్తవ్యులు రాములు కుమార్తె వివాహ వేడుకలో మరియు ఎస్‌విఆర్ ఫంక్షన్ హాల్‌లో అల్లాపూర్ వాస్తవ్యులు నవీన్ గౌడ్ వివాహ వేడుకలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.అలాగే విఘ్నేశ్వర కాలనీలో ఇందూరు బాలు గృహ ప్రవేశ పూజ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. నవల్గ గ్రామంలో యువ నాయకులు అనిల్ గౌడ్ కుమారుడు అభిజ్ఞాన్ గౌడ్ జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆనందాల్లో భాగస్వామ్యం కావడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *