వికారాబాద్ జిల్లా చెన్నారం గ్రామంలో తాగునీటి సంక్షోభం – పరిష్కారం కోసం వేడుకున్న ప్రజలు
పంచాయతీ ముందు మహిళల ఆగ్రహం – తాగునీరు ఇప్పించాలంటూ నిరసన
చెన్నారం గ్రామంలో తాగునీటి కష్టాలు – ఖాళీ కుండలతో మహిళల ఆందోళన
చెన్నారం గ్రామంలో తాగునీటి సమస్య – పంచాయతీ దగ్గర మహిళల నిరసన
అగ్ని జ్వాల ప్రతినిధి: తాండూరు
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని చెన్నారం గ్రామంలో తాగునీటి సమస్య మరింత తీవ్రమవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం గ్రామంలోని మహిళలు, చిన్నారులతో కలిసి పంచాయతీ కార్యాలయం ముందు ఖాళీ కుండలతో నిరసనచేపట్టారు.గ్రామస్తులుమాట్లాడుతూ –గత కొద్ది రోజులుగా తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ప్రతి రోజూ కిలోమీటర్ల దూరం నడిచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ ఘటన చెన్నారం గ్రామంలో ఆరవ వార్డులో చోటుచేసుకుంది
తాగునీటి సమస్య పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే మరింత తీవ్రమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో పానాధుల మహేష్ పి రాములు పకీరప్ప అంజలమ్మ రోజమ్మ సాయమ్మ బాలమణి లక్ష్మి లాలమ్మ

