శాంతినగర్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యం లో.. కొలువుదీరిన వినాయ కునికి పూజలు
ఆరోగ్య సేవల్లో ముందుండే శాంతినగర్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా వినాయక పూజలు
సేవాస్పూర్తితో ప్రజలకు అండగా నిలుస్తున్న విఠల్ నాయక్ – వినాయక పూజలో ప్రత్యేక ఆకర్షణ
—నాల్గవ రోజు వినాయకునికి ఘనంగా పూజలు
తాండూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ , వినాయక హాస్పిటల్ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్
అగ్నిజ్వాలా ప్రతినిధి: తాండూర్
తాండూర్: వినాయక చవితి సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని శాంతి నగర్ వినాయక సూపర్ స్పేషా లిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో.. వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ,వినాయక హాస్పిటల్ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ గణేష్ పూజలో పాల్గొన్నారు. అదేవిదంగా నాల్గవ రోజు శనివారం వినాయక పూజలో పలువురు దంపతులు, మహిళలు, చిన్నారులు పాల్గొని పూజలు జరిపారు. అనంతరం విఠల్ నాయక్ మాట్లాడుతూ.. తాండూర్ నియోజకవర్గ ప్రజలందరికీ సకల శుభాలు కలిగి.. విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాధుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ సందర్బంగా శుభాకాంక్షాలు తెలియజేశారు.పూజ కార్యక్రమంలో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

