చట్టపరమైన ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే

బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ నిర్ణయం హర్షణీయం

 

ఇది బీసీల సమిష్టి విజయం

 

చట్టపరమైన ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే

 

విద్యా ఉద్యోగ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 42% రిజర్వేషన్లను కల్పించాలి

 

కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా అమలు చేయాలి

 

జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్

 

అగ్నిజాల ప్రతినిధి,:తాండూర్ 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్ల అమలు కోసం పంచాయతీరాజ్ చట్టం 2018 సవరించి ఆర్డినెన్స్ తేవడం ద్వారా రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయాన్ని సాగతిస్తున్నామని జాతీయ బిసి సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల సమిష్టి విజయం అని అన్నారు తెలంగాణ క్యాబినెట్ ఆర్డినెన్స్ తీసుకోవడం ఇది కేవలం మొదటి అడుగు మాత్రమేనని చట్టపరమైన ఇబ్బందులు ఎలాంటి అడ్డంకులు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలుయ్యేలా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని అదేవిధంగా అన్ని వర్గాల వారు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారుఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు విద్య,ఉద్యోగ,కాంట్రాక్ట్ లకు కూడా రిజర్వేషన్లను కల్పించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా అన్ని హామీలను అమలు చేసేందుకు ఒక ప్రకటన విడుదల చేయాలి కొత్తగా 22 వేల 33 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలన్న మంత్రివర్గ నిర్ణయంలో బీసీలకు 42 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలి అని రాజ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారుఈ కార్యక్రమంలో బిసి రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ సుకుర్ బిసి మహిళా జిల్లా అధ్యక్షురాలు మధు లత శ్రీనివాస్ చారి బిసి మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు అనిత ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి కార్యదర్శి జగదీశ్వరి జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ నాయి బ్రాహ్మణ సమాజ అధ్యక్షులు పరమేష్ ముదిరాజ్ సంఘం యువజన కార్యదర్శి రాము ముదిరాజ్ ఆర్య కటిక సమాజ్ నాయకులు సురేష్ స్వేరోస్ అధ్యక్షులు శివ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజ్ బిసి యువ నాయకులు దుబాయ్ వెంకట్ నరసింహ పండు గౌడ్ రమేష్ సయ్యద్ శ్రీశైలం బాలు సోమేష్ కిషోర్ వివేక్ జాంగిర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *