నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి

 

 

కేంద్ర బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం కార్పొరేట్ల కోసం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి

ప్రాథమిక హక్కుల రక్షణ కై జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తాండూర్ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ ప్రదర్శన

అగ్నిజ్వాల ప్రతినిధి: తాండూర్

తాండూర్ లో సీఐటీయు ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలో దొడ్డి కొమరయ్య పార్క్ నుండి శాంత్ మాల్ చౌరస్తా భద్రప్పచౌక్ గాంధీ చౌక్ ఇంద్ర చౌక్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ప్రదర్శన ర్యాలీ సమ్మెలో భాగంగా నిర్వహించడం జరిగింది భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల రక్షణ కై ఈ రోజు జూలై 9 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా తాండూర్ లో నిర్వహించిన సందర్భంగా సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్ మాట్లాడుతూ* కేంద్రం బిజెపి ప్రభుత్వం తెచ్చిన కార్పొరేట్ల కోసం పెట్టుబడిదారుల కోసం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని కార్మిక వర్గానికి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు నేడు ముప్పు ఏర్పడిందని అన్నారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్ లను అమలులోకి తెచ్చారని, 8 గంటల పనిని రద్దు చేసి 12 గంటల పనిని చట్టబద్ధం చేస్తున్నారని విమర్శించారు. సామాజిక భద్రత పథకాలకు నిధులు తగ్గిస్తూ, చివరికి కార్మిక సంఘాలను సైతం రద్దు చేసేందుకు కూడా బరితెగించిందని విమర్శించారు. యాజమాన్యాలతో బేరసారాలు ఆడే అనే హక్కును తొలగించి భారత్ న్యాయ సంహిత చట్టం ద్వారా నాన్ బేయిలబుల్ కేసులుగా మార్చడం, పని స్థలాల వద్ద గేటు మీటింగ్లో కరపత్రాలు పంపిణీ వంటి వాటిని సైతం నిషేధించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులన్నిటిని తుంగలోకి తొక్కుతున్నారని విమర్శించారు. చట్టాలు అమలు చేయని యాజమాన్యాలకు శిక్షలు తగ్గించడం కార్మిక శాఖను పూర్తిగా ఫెసిలిటెట్ విభాగంగా మార్చడం స్కీం వర్కర్లను కార్మికులకు గుర్తించకుండా వెట్టి చేసే విధంగా లేబర్ కోడ్ లను రూపొందించారాని విమర్శించారు. కార్మికులకు సమ్మె చేయలేని పరిస్థితులను కల్పించి నాలుగు లేబర్ కోడ్ ల ద్వారా కార్మికులను తిరిగి బానిసత్వంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కార్మిక చట్టాలను రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజలు కార్మికులు సిద్ధంగా ఉండాలని ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి యు మల్కయ్య సిఐటియు తాండూర్ డివిజన్ నాయకులు కృష్ణ అంబరప్ప నర్సిములు షబ్బీర్ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు బాలమణి భేబి రామంజమ్మ రాజేశ్వరి విజయలక్ష్మి జయంతి సంధ్యారాణి సరస్వతి సుధారాణి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఏఎన్ఎంలు భారతి మల్లమ్మ ఈసీ ఏఎన్ఎం సుమలత శాంత ఆశ వర్కర్స్ అరుణ రాములమ్మ మంగమ్మ గ్రామపంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు శ్రీనివాస్ చందు శామప్ప బిచ్చప్ప తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *