చిన్నకోడెపాకలో భూలక్ష్మీ బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
అగ్ని జ్వాలా ప్రతినిధి :భూపాలపల్లి
భూపాలపల్లి నియోజకవర్గం ఉమ్మడి రేగొండ,కొత్తపల్లిగోరి మండలం చిన్నకోడెపాక గ్రామంలో శ్రీ భూలక్ష్మీ బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఎమ్మెల్యేకు బొడ్రాయి కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నేతలు శాలువాలు కప్పి డప్పు చప్పుళ్ళతో స్వాగతం పలికారు.అనంతరం యాగశాల, బొడ్రాయి వద్ద టెంకాయ కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. చిన్నకోడెపాక గ్రామ అభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

