శ్రీరాముని కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,

శ్రీ రాముడి కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి.

మళ్ళీ వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమే.

పైలెట్ రోహిత్ రెడ్డి

 

ఎన్ఆర్ఐలతో కలిసి టెక్సాస్ లోనీ ప్రముఖ ఆలయం కార్యసిద్ధి హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన పైలెట్

అగ్ని జ్వాలా ప్రతినిధి: తాండూర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మరియు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని, బీఆర్ఎస్ యూఎస్ఏ విభాగం ఆధ్వర్యంలో డల్లాస్ నగరంలో జరగనున్న సభలో పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్న పైలెట్ రోహిత్ రెడ్డి ఈరోజు టెక్సాస్ రాష్ట్రంలోని కార్యసిద్ధి హనుమాన్ దేవాలయాన్ని స్థానిక ఎన్నారైలు మరియు మాజీ కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మరియు పైలెట్ రోహిత్ రెడ్డి  బావ నవీన్ రెడ్డితో కలిసి సందర్శించారు. పూజల అనంతరం స్థానికులు వారిని ఘనంగా సన్మానించారు. శ్రీరాముని కృపతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మళ్లీ వచ్చేది మన బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి గారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *