అరెస్టులతో ఉద్యమాలని ఎవరు ఆపలేరు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జిని, క్యాంపస్ భూములను లాక్కోవడాన్ని ఖండిస్తున్నాం.!!
అగ్ని జ్వాలా ప్రతినిధి తాండూర్ :
వికారాబాద్ జిల్లా మండలం తెలుగుదేశం పార్టీ తాండూర్ నియోజకవర్గ నాయకులు ఎర్ర హనుమంతు మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు కే శ్రీనివాసులు మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరెస్టులు చేసి ప్రజా సమస్యలను పరిష్కారం చేయలేదని ఉద్యమాలు ప్రజా సమస్యలపై నిరంతరం కొనసాగిస్తామని అన్నారు అరెస్టులకు భయపడి ఉద్యమాలకు వెనుకడుగు వేసేది లేదన్నారు ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేస్తే ఉద్యమాలు ఉండబోవని అన్నారు ప్రజా వ్యతిరేక విధానాలను చేపట్టడం వల్లనే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుందని అన్నారు అటువంటి వ్యతిరేకతను నాయకులు అరెస్ట్ చేస్తే ముందస్తు అరెస్టును ఖండించారు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఏడవ గ్యారెంటీ ఇదేనా అని అన్నారు

