వారి పోరాటానికి అండగా ఉంటామని తెలిపిన కేటీఆర్,

 

 

ఈరోజు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన హెచ్‌సీయూ విద్యార్థులు 

వారి పోరాటానికి అండగా ఉంటామని తెలిపిన కేటీఆర్,

 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులపైన రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన అణచివేతను పాల్పడుతున్నదని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 

హైదరాబాద్ అగ్నిజ్వాల ప్రతినిధి 

 

ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్ 

తెలంగాణ ఉద్యమంలో ఆశువులు బాసిన అమరవీరుల త్యాగాల ఫలమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ

తొలిదశ తెలంగాణ ఉద్యమం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాలక్రమంలో అనేక పేరు ప్రఖ్యాతలు సాధించుకుంది అక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో గొప్ప సేవ చేస్తున్నారు

హెచ్‌సీయూ దేశానికి తలమానికంగా ఉన్న విద్యాసంస్థల్లో ఒకటిగా ఉన్నది

హెచ్‌సీయూ విద్యార్థులు ఎలాంటి స్వార్థం లేకుండా సమాజ హితం కోసం చేస్తున్న గొప్ప పోరాటం ఇది

హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం పడుతున్న ఆరాటం చాలా గొప్పది

ఈమధ్య కొత్త తరం పిల్లల్లో విద్యార్థుల్లో పోరాట స్ఫూర్తి తగ్గిందని అప్పుడప్పుడు బాధపడతాం కానీ ఇలాంటి సరైన సందర్భంలో యూనివర్సిటీ విద్యార్థులు చూపెడుతున్న తెగువ, వారి పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాం

ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలను విద్యార్థుల తరఫున, పార్టీ తరఫున అడుగుతున్నాము

రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థులపైన, యూనివర్సిటీ భూములపైన రాజకీయం చేస్తున్నది

వందల బుల్డోజర్లను, హిటాచీ యంత్రాలను పెట్టి అక్కడున్న చెట్లను, జంతువులను, చంపిమరీ వేగంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నది ఎందుకు ఇంత వేగంగా భూముల కబ్జాకు ఆరాటపడుతున్నదో చెప్పాలి

గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో నగరం విస్తృతంగా పెరిగింది. ఒక కాంక్రీట్ జంగల్‌గా మారింది

భారతదేశంలోని ఏ నగరంలో అంత తక్కువ విస్తీర్ణంలో భారీగా నగరం అభివృద్ధి చెందలేదు. కోట్లాది చదరపు అడుగుల నివాస గృహాలు నిర్మాణం అవుతున్నాయి

పశ్చిమ హైదరాబాద్‌కి ఊపిరి నిచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతాలే

పశ్చిమ హైదరాబాదులో భవిష్యత్తులో ఢిల్లీ మాదిరి ఊపిరి పీల్చుకోవడమే కష్టం అయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ ఉన్న హరితాన్ని అలాగే ఉంచితే భవిష్యత్తుకు కొంత భరోసా ఉంటుంది

ఒక ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఏ విధంగా ఈ 400 ఎకరాలు అమ్ముతారని విద్యార్థులు అడుగుతున్నారు

ఈ 400 ఎకరాలను అమ్మేముందు జరిగే పర్యావరణ నష్టం ప్రభావంపైన అధ్యయనం చేయాలి అని అడుగుతున్నారు

2003లో ఐఎంజీ భారత అనే కంపెనీకి క్రీడా సదుపాయాల కోసం ఈ 400 ఎకరాలను కేటాయించింది

కేవలం స్టేడియంలు క్రీడా శిక్షణకు సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వాలు భూములను ఆ సంస్థకు ఇచ్చింది

కానీ ఈ ప్రభుత్వం అదే ప్రాంతంలో 400 ఎకరాలలో కోట్లాది చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టి కాంక్రీట్ జంగల్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నది

మొన్న 21 సంవత్సరాల తర్వాత కేసు తేలింది. కానీ ప్రభుత్వం మాత్రం వెంటనే ఆ భూములను అమ్మి రూ. 30 వేల కోట్ల రూపాయలను సేకరించాలని ప్రయత్నం చేస్తుంది

రేవంత్ రెడ్డి ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే ఎజెండాపైన ప్రజలు నిర్ణయిస్తారు

ఫ్యూచర్ సిటీ 50 వేల ఎకరాలలో కడతామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు

ఫార్మాసిటీ భూములతో పాటు మరో 30 వేల ఎకరాలు సేకరించి నూతన నగరం కడతామంటున్నారు

ఇప్పటికే వేల ఎకరాల భూమి మీకు అందుబాటులో ఉన్నప్పుడు 45 వేల ఎకరాలను అమ్ముకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు

45,000 ఎకరాలు ప్రభుత్వానికి అందుబాటులో వచ్చే ఈ తరుణంలో 400 ఎకరాలపైన ఎందుకు ఇంత దారుణంగా దాష్టీకంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం సమాధానం చెప్పాలి

అడ్డమొచ్చిన విద్యార్థులను ఆడబిడ్డలను లాగి పడేసి దుస్తులను చించి మరీ దుశ్శాసశానుడి మాదిరి వ్యవహరించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగబడుతున్నది

అక్కడ బుల్డోజర్లు చేస్తున్న కార్యక్రమాలకు వన్యప్రాణులు అరుస్తున్న విజువల్స్ మీకు కనిపిస్తలేవా రాహుల్ గాంధీ

హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపైన పర్యావరణహితం కోసం ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం జరిగింది

అయితే ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల కన్నా ముందే అరాచకంగా వ్యవహరిస్తున్నది ఎందుకు రాహుల్ గాంధీ స్పందించడం లేదు

గతంలో రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీకి రెండుసార్లు వచ్చి వెళ్లారు. మరీ అలాంటిది విద్యార్థులపైన ఇన్ని అరాచకాలు జరుగుతున్నా.. పర్యావరణంపైన ఇంత అక్రమంగా తమ సొంత ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఎందుకు స్పందించడం లేదు విద్యార్థులు మండిపడుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *