తాండూర్ మున్సిపల్ కార్మికులు సిఐటియు యూనియన్ లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి. సీఐటీయూ డిమాండ్
సిఐటియు ఆధ్వర్యంలో తాండూర్ మున్సిపాలిటీలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్
తాండూర్ ఆగ్ని జ్వాలా ప్రతినిధి:::యూనియన్ సమావేశం ఏర్పాటు చేసి సిఐటియు అనుబంధంగా ఇప్పటినుండి కొనసాగుతామని తీర్మానం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీ లలో కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఎన్ఎంఆర్, ఫిక్స్ డే పే తదితర పద్ధతుల్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో చట్టబద్ధ రాజ్యాంగ పదవులలో ఉన్నవాళ్లు మున్సిపల్ కార్మికుల సేవల గురించి గొప్పలు మాట్లాడుతున్నారు కానీ మున్సిపల్ కార్మికుల జీవితాల గురించి మాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు మానవ మల మూత్రాలను సైతం తొలగించి పట్టణాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు వేతనాల పెంపు ఉద్యోగ భద్రత గురించి మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రెండవ PRC లో కనీస వేతనం 26 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు కార్మికుల ఆర్థిక సామాజిక గౌరవాన్ని పెంచే విధంగా ఉద్యోగ భద్రత కల్పించి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు ఇచ్చే వేతనాలు కూడానెల నెల అందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు వేతనాలు సక్రమంగా అందక ఉద్యోగ భద్రత లేక అనారోగ్యాలతో కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని అన్నారు అత్యున్నత న్యాయస్థానాలు సైతం సమాన పనికి సమాన పనికి వేతనం ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు ఎనిమిది గంటల పది దినాలు అమలు కాకపోవడం వల్ల కార్మికులు అనారోగ్యాల పాలావుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలని రెండవ PRC లో కనీస వేతనం 26,000 గా నిర్ణయించాలని పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ లు వెంటనే ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో *సిఐటియు తాండూర్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గౌరవ అధ్యక్షుడు కే రాములు,అధ్యక్షులు కే శ్రీనివాస్(సిఐటియు),ఉపాధ్యక్షులు బి శ్రీనివాస్,N వెంకటప్ప డి లక్ష్మిన్,ఎం వెంకటప్ప,సహకార్యదర్శిలు పి ప్రకాష్,ఎం బలరాం,కోశాధికారి జె నరేష్, ప్రధాన కార్యదర్శి డి వెంకటయ్య,కమిటీ సభ్యులుగా డి వీరేశం ఏం ఆశప్ప బి నర్సిములు ఏం అశోక్ కే శంకర్ జె రాములు తదితరులు కార్మికులు పాల్గొన్నారు.